Skip to main content

Posts

Featured

వెబ్ సైట్ లో మూవీ టిక్కెట్లు బుక్ చేస్తూ 40 వేలు టోకరా

మూవీ టికెట్లను క్యాన్సల్ చేసే ప్రక్రియలో 40 వేలరూపాయలను కోల్పోయింది ఓ అమ్మాయి. ఈ ఘటన లక్నో లోని జానకిపురంలో జరిగింది. జాన్వీ అనే యువతి తన స్నేహితులతో కలిసి మార్చి30వతారీకున.. సినిమాకు వెళ్లడానికి సెకండ్ షోకు టికెట్స్ ను ఓ ప్రముఖ వెబ్ సైట్ నుండి బుక్ చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల జాన్వీ టికెట్స్ క్యాన్సల్ చేసారు. అందుకు తగిన నగదు జాన్వీ ఎకౌంట్ లో క్రెడిట్ కాలేదు. ఇందుకు గాను..ఆ వెబ్ సైట్ కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడగా వారు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. కొంత సేపటికి జాన్వీకి సదరు వెబ్ సైట్ నుంచి కాల్ చేస్తున్నట్టుగా ఓ వక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. జాన్వీ నగదును తిరిగి ఆమె ఎకౌంట్ లో క్రెడిట్ చేయడానికి జాన్వీ యొక్క డెబిట్ కార్డు డీటేల్స్ అడిగి తెలుసుకున్నాడు. ఆకోద్ది సేపటికే జాన్వీ ఎకౌంట్ నుండి.. 40 వేలు మాయమయ్యాయి. తాను మోసపోయానని తెలుసుకున్న జాన్వీ లక్నో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Posts

సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం

సబ్జెక్టు చెప్పేవారు లేరు

ధావన్ మెరుపు సెంచరీ: బెంగుళూరు టెస్టు

శ్రీ రెడ్డి కి నాని భార్య కౌంటర్

దళిత పదం నిషేధం .. ఇక నుంచి రాయకూడదు మాట్లాడకూడదు