బెంగళూరు వేదికగా గురువారం ( జూన్-14) ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ చెలరేగి ఆడుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (100) సెంచరీ చేశాడు. 87 బాల్స్ లో 19 ఫోర్లు, 3 సిక్సులతో మెరుపు సెంచరీ చేశాడు. దీంతో టెస్టు మ్యాచుల్లో లంచ్ బ్రేక్ కు ముందే సెంచరీ చేసిన ప్లేయర్లలో ఆరో ఆటగాడిగా ధావన్ చేరాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ 41 హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. బంగ్లాదేతో ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్ ల్లో సత్తా చాటిన ఆఫ్గన్ ..ఇండియాపై గెలవాలని తహతహలాడుతోంది. అయితే భారత్ మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదనే రీతిలో బ్యాటింగ్ చేస్తోంది. 27 ఓవర్లు ముగిసేసమయానికి భారత్ స్కోరు వికెట్ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. IPL లో ఆకట్టుకున్న ఆఫ్గన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కోంటున్నారు. దీంతో భారత్ ..భారీ స్కోరు దిశగా కనిపిస్తోంది.
Comments
Post a Comment