శ్రీ రెడ్డి కి నాని భార్య కౌంటర్

టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రతి ఏడాది ఎదో ఒక వివాదంపై నేషనల్ లెవెల్లో వైరల్ అవుతోంది. బాహుబలి లాంటి గొప్ప సినిమాను అందించిన తరువాత ఇంటర్నేషనల్ మీడియా ఇటు వైపు ఓ కన్నేసి ఉంచింది. అది మన గొప్ప తనం అనుకోవాలో లేక ఇప్పుడు వస్తున్న వివాదాలకు అవమానకరంగా అనుకోవలో అర్ధం కావడం లేదని కొందరు సినీ ప్రముఖులే వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.


ఇక నాని శ్రీ రెడ్డి వివాదం రోజు రోజుకి ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇటీవల శ్రీ రెడ్డి చేసిన ఘాటు ఆరోపణలకు నాని కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక శ్రీ రెడ్డి కూడా లిగర్ గా ఫైట్ చేస్తాను అంటూ ఆన్సర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై నాని సతీమణి అంజన పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు.


సినిమా పరిశ్రమ చాలా గొప్పది. అయినా కూడా కొంత మంది కావాలని పబ్లిసిటీ కోసం ఇతరుల జీవితాలను కించ పరుస్తూ నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే నీచంగా చండాలంగా కామెంట్లు చేస్తున్నారో.. వారి మాటలను ఎవరు కూడా నమ్మరు. అయినా వారి జీవితాలను వ్యక్తిగతంగా దిగజార్చుకోవడానికి అంతలా ఎలా సిద్ధపడుతున్నారో” అంటూ నాని భార్య అంజన ట్వీట్ చేశారు.

Comments